బిగ్ బ్రేకింగ్ : ఏపీ కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్న వై ఎస్ జగన్.!

Thursday, August 22nd, 2019, 10:20:34 AM IST


ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైసీపీ పార్టీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.ఇప్పుడు కూడా మరోసారి ఆంధ్ర రాష్ట్రం బాగు కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వైసీపీ అధిష్టానం అధికారికంగా తెలియజేసింది.

ఇప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్ర ప్రణాళికా బోర్డును జగన్ రద్దు చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారని దాని స్థానంలో యావత్తు రాష్ట్రం అంతటా ప్రాంతాల వారీగా అందరికి సమన్యాయ,సర్వతోముఖాభివృద్ధికి తావిచ్చేలా మొత్తం నాలుగు ప్రాంతీయ ప్రణాళికా బోర్డులను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ నియమించినట్టు తెలుస్తుంది.

నీటి నిర్వహణ,పారిశ్రామిక అభివృద్ధి,వ్యవసాయ ఉత్పత్తులు వంటి సంక్షేమ ప్రణాళికలు రూపకల్పన వంటివి లక్ష్యంగా ఈ బోర్డు సభ్యులు పని చేస్తారని తెలుస్తుంది.అందుకోసం జగన్ కొంతమంది నిపుణలను కూడా నియమించబోతున్నట్టు సమాచారం.ఈ నాలుగు ప్రాంతీయ ప్రణాళికల బోర్డులకు కేంద్రాలుగా విజయనగరం,కాకినాడ,గుంటూరు మరియు కడప జిల్లాను ఎంచుకున్నారని వైసీపీ తెలియజేసింది.