కేసీఆర్ కు గట్టి దెబ్బే వేసిన జగన్..!

Saturday, July 11th, 2020, 07:01:15 AM IST

మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గ్రాఫ్ లు ఇప్పుడు ఊహించని విధంగా మారిపోయాయి అని చెప్పాలి. గత ఎన్నికల అనంతరం ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు మధ్య మంచి సత్సంబంధాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఆ సమయంలో జగన్ పై అనేక సెటైర్లు ఇతర పార్టీలు వారు వేసేవారు. కేసీఆర్ ఏం చెప్తే జగన్ అది చేస్తాడు అని ఏపీకి కూడా సీఎం కేసీఆరే అన్నట్టుగా విమర్శలు వేసేవారు. కానీ వారందరికీ జగన్ తన పనితీరుతో సమాధానం ఇచ్చారని చెప్పాలి. ముఖ్యంగా ఈ కరోనా కష్ట కాలం జగన్ గ్రాఫ్ ను అమాంతం పెంచింది.

జగన్ అద్భుతమైన పని తీరు మరియు ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిస్సహాయత జగన్ కు మరింత ప్లస్ కావడంతో కేసీఆర్ కు భారీ దెబ్బ పడ్డట్టు అయ్యింది. దీనితో జగన్ తనను విమర్శించిన వారు అందరికీ తన పని తీరుతోనే సమాధానం ఇచ్చారని చెప్పాలి.