రోజాకు పదవి ఇవ్వడం కోసం జగన్ కసరత్తు !

Sunday, June 9th, 2019, 01:05:10 PM IST

అనేక తర్జనభర్జనల తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 25మందితో కూడిన తన మంత్రి వర్గాన్ని ఏర్పాటుచేశారు. అయితే మొదటి నుండి జగన్ వెంట నడుస్తూ మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఆశించిన చాలామంది సీనియర్లకు నిరాశ ఎదురైంది. రెండునంరేళ్ళ తర్వాత కొత్త మంత్రుల పదవిలో కూర్చోబెడతామన్నా కొందరు శాంతిచట్లేదు. వారిలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రి అవగానే రోజాకు మంత్రి పదవి, అందులోనూ కీలక శాఖ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ జగన్ కేబినెట్లో ఆమెకు చోటివ్వలేదు.

కానీ ఆమెకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం కోసం జగన్ కృష్టిచేస్తున్నట్టు తెలుస్తోంది. మొదట నామినేటెడ్ పదవి ఇవ్వాలనుకున్నా ఇప్పుడు మాత్రం రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవిని ఆమెకు ఇవ్వాలని యోచిస్తున్నారట. అయితే ఇక్కడ కొని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవిలో ఉండే వారికి రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండకూడదు. అందుకే జగన్ తన అడ్వకేట్ జనరల్ తో రోజాను రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవిలో కూర్చోబెట్టే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలుస్తున్నారట. ఒకవేళ ఎలాంటి చిక్కులూ రాకుండా ఉంటే వెంటనే ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవికి ఎంపిక చేస్తారట జగన్.