సీబీఐకి సాదర స్వాగతం పలుకుతున్న జగన్ !

Sunday, June 2nd, 2019, 08:12:58 PM IST

గత ఏడాదిగా సీబీఐ ఏపీలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పలువురు టీడీపీ ప్రముఖులపై సోదాలు చేస్తూ హడావుడి చేసింది. దీంతో ప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీబీఐని రాష్ట్రాంలోకి రానివ్వకుండా సహజ అంగీకారాన్ని వెనక్కి తీసుకుంటూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. మోడీ వ్యవస్థల్ని కక్ష సాధింపుకు ఉపయోగిస్తున్నారనే కారణంగా బాబు ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి రాష్ట్రంలో సీబీఐ అధికారుల స్వేచ్ఛకు దాదాపుగా చెక్ పండింది.

కానీ ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహజ ఆంగీకార రద్దును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారట. దీంతో ఎప్పటిలాగే సీబీఐకి రాష్ట్రంలో తన కార్యకలాపాల్ని నిర్వహించుకునే పూర్తి వెసులుబాటు దొరకనుంది. దీంతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. చంద్రబాబు హయాంలో జరిగిన ఏ అవినీతిని వదిలేది లేదని శపథం చేసిన జగన్ ఇలా సీబీఐని సాదరంగా రాష్ట్రంలోకి తీసుకొచ్చేయడంతో తమ తప్పిదాలు, అక్రమాలు ఎక్కడ బయపడతాయోనని బడా నేతలు తలలు పట్టుకుంటున్నారట.