అమెరికాలో కూడా జగన్ కు ఇంత క్రేజ్ ఉందా..?

Sunday, August 18th, 2019, 03:45:55 PM IST

తాజాగా వైసీపీ అధినేత మరియు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే.మొట్ట మొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి హోదాలోజగన్ ఈ పర్యటనకు రాబోతున్నారని తెలిసినప్పటి నుంచి అక్కడి వైసీపీ అభిమానులు ఈ సభ ప్రతిష్టాత్మకంగా నిలిచిపోవాలని భారీ ఏర్పాట్లను చేసి ప్రతీ ఒక్క చిన్న విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇదే ఊపులో జగన్ అమెరికాలో అడుగు పెట్టగా అక్కడి వైసీపీ అభిమానులు ఘన స్వాగతాన్ని అందించారు.ఆ తర్వాత ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హచిన్సన్ కన్వెన్షన్ సెంట్రల్ హాలును వేదికగా అలంకరించగా జగన్ రాకతో వేలాది మంది అభిమానులు అసలు ఊహించని రేంజ్ లో తరలి వచ్చారని తెలుస్తుంది.మాములుగా అయితే అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వారు ఈ రేంజ్ లో హాజరు కావాలంటే వారందరికీ సరైన సమయం కుదిరి అందులోను ఏవైనా భారీ ఈవెంట్లలో అగ్ర తారాగణం ఉంటే తప్ప జరగదు.

కానీ ఒక రాజకీయ నాయకుడికి మాత్రం ఈ స్థాయిలో జనం రావడం అయితే ఒక్క జగన్ కే చెల్లింది అని అక్కడ వైసీపీ అభిమానులు తెలుపుతున్నారు.చాలా మందికి అయితే పాసులు కూడా దొరకలేదని కూడా తెలుస్తుంది.జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి కావడం వల్లనే ఈ స్థాయిలో అభిమానులు వచ్చారని,జగన్ కు అమెరికాలో కూడా ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందని ఈ సభను తిలకించిన ప్రవాసాంధ్రులు అంటున్నారు.

డాలస్ సభలో వై ఎస్ జగన్ ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి