కొత్త పార్టీకి అధికార ప్రతినిధులను నియమించిన వైఎస్ షర్మిల..!

Friday, June 4th, 2021, 10:11:35 PM IST

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే షర్మిల కొత్త పార్టీ పేరును వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీ బలోపేతానికి ఆమె పకడ్బందీగా ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కొత్త పార్టీకి సంబంధించి వైఎస్ షర్మిల అధికార ప్రతినిధులను నియమించింది. అయితే 9 మందితో కూడిన తొలి అధికార ప్రతినిధుల జాబితాను విడుదల చేశారు. కొండా రాఘవరెడ్డి, పిట్ట రాంరెడ్డి, ఇందిరా శోభన్, తూడి దేవేందర్‌రెడ్డి, ఏపూరి సోమన్న, సయ్యద్ ముజ్జబ్‌, మతిన్ ముజాదద్ది, భూంరెడ్డి, బీశ్వ రవీందర్‌లను అధికార ప్రతినిధులుగా నియమించారు.