ప్రభుత్వానికి దొరకని కరోనా వాక్సిన్లు ప్రైవేట్ కి ఎలా దొరుకుతున్నాయి కేసీఆర్ సారూ – షర్మిల

Monday, June 7th, 2021, 12:00:35 AM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా వైరస్ వాక్సిన్ ఈ మహమ్మారి కట్టడి లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం పై వైఎస్ షర్మిల ఈ వ్యాక్సిన్ ల విషయం లో మరొకసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి దొరకని కరోనా వాక్సిన్లు ప్రైవేట్ కు ఎలా దొరుకుతున్నాయి కేసీఆర్ సారూ అంటూ సూటిగా ప్రశ్నించారు. మీకు చేతకాకనా, ప్రజల ప్రాణాలు అంటే పట్టింపు లేకనా, కమీషన్ల కి ఆశపడా, లేక వాక్సిన్ల భారం తగ్గించుకొనేందుకా అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.ఇంకెన్నాళ్ళు దొర మూతకండ్ల పాలన అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే అందుకు సంబంధించిన ఒక పత్రికా ప్రకటన ను సైతం పోస్ట్ చేశారు షర్మిల. రాష్ట్రం లో వాక్సిన్ అందుబాటులోకి వస్తున్న తీరు పట్ల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తలాపున సముద్రం ఉన్నా చాప దూప కేడ్చినట్లు అంటూ విమర్శించారు. వాక్సిన్ల తయారీ సంస్థలు గీడనే ఉన్నా, మీకు మాత్రం దొరకడం లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫస్ట్ డోస్ బందు పెట్టీ నెల రోజులు అయింది అంటూ చెప్పుకొచ్చారు. ప్రైవేట్ కి మాత్రం దొరుకుతున్నాయి అని అన్నారు. ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని ప్రజలకు ఉచితంగా వాక్సిన్ అందించండి అంటూ షర్మిల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.