పేదోనికి రోగమొస్తే అప్పులే దిక్కు.. కేసీఆర్ సర్కార్‌పై షర్మిల ఫైర్..!

Saturday, June 5th, 2021, 03:55:47 PM IST

తెలంగానలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల గత కొద్ది రోజులుగా కేసీఆర్ సర్కార్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తుంది. తాజాగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేసిన కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కనికరం లేని ఖ్ఛృ గారి పాలనలో పేదోనికి రోగమొస్తే.. అప్పులే దిక్కు అని, అప్పులు చేసి లక్షలు కుమ్మరించిన ప్రాణం నిలుస్తుందన్న గ్యారంటీ లేదని, చచ్చింది నా వాడా నాకేంపట్టి అన్నట్టుంది సారు తీరు, ఒకవైపు కన్నవారిని పోగొట్టుకొని దిక్కుతోచని స్థితిలో ఉంటే మరోవైపు ఆస్తులు అమ్మిన అప్పులు తీర్చలేమనే ఆవేదన ఆ కుటుంబాలదని షర్మిల అన్నారు. కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చి కరోనాకు ఉచితంగా వైద్యాన్ని అందించాలని షర్మిల డిమాండ్ చేశారు.