ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి.. సీఎం కేసీఆర్‌కు వైఎస్ షర్మిల సజేషన్..!

Saturday, May 15th, 2021, 04:12:03 PM IST


తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల గత కొద్ది రోజులుగా కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే తాజాగా మరోసారి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశంపై స్పందించిన షర్మిల కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేది ఆలోచిస్తాం అని చెప్పి 8 నెలలు గడిసిపోయిందని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేది ఇంకెప్పుడు కేసీఆర్ సారు అని ప్రశ్నించారు. చచ్చే వారు పేదలు కాదనా? లేక పేదలు చచ్చినా ఎవరు అడిగేవారు ఉండరనే ధైర్యమా? లేక మీ లెక్కకు సరిపడ మరణాలు ఇంకా నమోదు కాలేదనా అని నిలదీశారు.

అంతేకాదు అయ్యా కేసీఆర్ సారు ఇప్పడికే జనం తిరగ పడుతున్నరు, కరోనాతో రోడ్ల మీద పడ్డమని, బతుకులు ఆగమైనయని, జనం ఇంకా బర్బాద్ కాకముందే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోండని లేదంటే కరోనా సునామీలో కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవుడు ఖాయమే అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.