వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్..!

Monday, June 7th, 2021, 06:42:16 PM IST


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే “వైఎస్సార్ తెలంగాణ పార్టీ” పేరుతో కొత్త పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించుకున్నారు. అయితే పార్టీ పేరు మరియు పార్టీ పెట్టబోయే తేదీని సైతం నేడు షర్మిల పార్టీ సమన్వయకర్త వాడుక రాజగోపాల్ అధికారికంగా ప్రకటించారు.

అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనను తెలంగాణలో మళ్ళీ తీసుకురావలని, ఆయన ఆశయాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా, వైఎస్సార్ గారు అందించిన సంక్షేమం ప్రతి ఇంటికి మళ్ళీ చేరేలా షర్మిల తెలంగాణలో ‘వైఎస్సార్ తెలంగాణ’ పార్టీ పెట్టాలనుకుందని చెప్పుకొచ్చారు. అయితే వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటు మరియు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వాడుక రాజగోపాల్ చెప్పుకొచ్చారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరు వైఎస్ విజయమ్మ గారి సమ్మతితోటి, వారి ఆశీస్సుల తోటే జరిగిందని ఎన్నికల కమీషన్ నుంచి అన్ని అనుమతులు రాగానే పార్టీకి సంబంధించి మరిన్ని వివరాలు ప్రకటిస్తామని రాజగోపాల్ అన్నారు.