ఇప్పటికైనా మొద్దు నిద్రను వీడండి.. కేసీఆర్ సర్కార్‌పై షర్మిల సీరియస్..!

Thursday, April 29th, 2021, 10:37:15 PM IST

టీఆర్ఎస్ సర్కార్‌పై వైఎస్ షర్మిల మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కొలువులు.. కరోనా.. కేసీఆర్ ఈ మూడింటితో కామన్‌గా సంబంధం ఉన్నది కోర్టులు, ఈ రోజు ప్రభుత్వ చేతగానితనంపై కోర్టులు ఎప్పటికప్పడు మొట్టికాయలు వేస్తూనే ఉన్నాయని అన్నారు. అయితే మొన్న కరోనాను కట్టడి చేసేందుకు మీరు చర్యలు తీసుకొంటారా లేక మమ్మల్ని తీసుకోమంటారా అని హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసిందని అన్నారు.

జనాలు చస్తూ ఉంటే మీకు ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం అవసరమా అని ప్రభుత్వంపై ఘాటుగా స్పందించిందని, ఇక ఈ రోజు TSPSCలో సభ్యులను 4 వారాల్లోగా నియమించండి లేదంటే TSPSCని మూసివేయండి అని ప్రభుత్వ అసమర్థ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అని, ఈ రోజు కోర్టులు చెపితే గాని వాళ్ళ బాధ్యతలు తెలుసుకోలేనంత మొద్దు నిద్రలో ఉంది ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా మొద్దు నిద్రను వీడి కరోనాను కట్టడి చేయడంతో పాటు TSPSCలో సభ్యులను నింపి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.