కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గు లేదు.. వైఎస్ షర్మిల గుస్సా..!

Friday, April 30th, 2021, 06:12:57 PM IST

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌కు సిగ్గు లేదని ధ్వజమెత్తారు. కరోనా టెస్టులు లేవు, హాస్పిటల్స్‌లో బెడ్స్ లేవని, పట్టించుకొనే డాక్టర్స్ లేరు, ఊపిరి నిలిపే ఆక్సిజన్ సిలిండర్లు లేవు, బతికించే వాక్సిన్ లేదు, కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చే ఆలోచన లేదు, కరోనా రోగులపై కనికరం చూపేది లేదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై షర్మిల మండిపడ్డారు.

ఇదిలా ఉంటే అంతకు ముందు తెలంగాణ గ‌వ‌ర్నర్‌ తమిళసైకు వైఎస్ ష‌ర్మిల టీం లేఖ‌ రాసింది. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్లు దొర‌క‌ని ప‌రిస్థితి నెలకొందని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే స్థోమత పేదలకు లేదని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే స్థోమత పేదలకు లేదని అందుకే కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చితే పేదలకు ఉప‌యోగకరంగా ఉంటుందని లేఖ ద్వారా విజ్ణప్తి చేశారు.