ఇది పొమ్మనలేక పొగ పెట్టడమా.. మంత్రి ఈటల ఇష్యూపై వైఎస్ షర్మిల కామెంట్స్..!

Saturday, May 1st, 2021, 09:00:00 PM IST

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా ఇష్యూపై స్పందించిన వైఎస్ షర్మిల కేసీఆర్ సర్కార్‌కు సూటి ప్రశ్నలు విసిరారు. ఎవరు అవినీతి చేసినా వారికి శిక్ష పడాల్సిందే అని, ఈటల అవినీతిపై మీ ఎంక్వైరీని స్వాగతిస్తున్నా అంటూనే అయ్యా కేసీఆర్ దొరగారు ఇది పొమ్మనలేక పొగ పెట్టడమా.. లేక మిమ్మల్ని ప్రశ్నిస్తున్నరని వాళ్ళ పదవికి ఏసరు పెట్టడమా అని ప్రశ్నించారు. అయితే ఈ రోజు ఈటలపై 10 మంది కంప్లైంట్ చేయగానే 10 నిమిషాల్లో స్పందించి ఎంక్వైరీకి ఆదేశించారని అన్నారు.

అయితే అన్యాయం జరుగుతుంది చంద్రశేఖరా.. అని మంత్రి మల్లారెడ్డిపై, ంళా ముత్తిరెడ్డిపై ఆరోపణలు చేసినప్పుడు మా భూములను ంళా సైదిరెడ్డి కబ్జా చేసిండని జనం మోత్తుకొన్నప్పుడు మీకు వినిపించలేదా అని నిలదీశారు. మీకు సలాంలు కొట్టి గులాంగిరి చేసే వాళ్లకు ఏ ఆపద ఉండదా అని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవినీతి ఆరోపణలు ఎదురుకొంటున్న మీ పార్టీ ప్రతినిధులపై కూడా ఎంక్వైరీకి ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నమని షర్మిల అన్నారు.