కరెక్ట్ టైమ్ లో వస్తున్న వైఎస్ బయోపిక్!

Wednesday, September 12th, 2018, 07:53:07 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో సంచలన విజయాలు అందుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా ఆయన బయోపిక్ యాత్ర ప్-పేరుతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ పొలిటికల్ కెరీర్ లో పాదయాత్ర ఏ విధంగా ఉపయోగపడిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అందుకే అదే పేరుతో సినిమాను తెరకెక్కించారు. మలయాళం స్టార్ హీరో మమ్ముంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే సినిమాకు సంబందించిన పోస్టర్లు అలాగే రిలీజైన టీజర్, పాటకు కూడా మంచి స్పందన లభించింది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన వైఎస్ అభిమానులకు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పేసింది. డిసెంబర్ 21న వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్బంగా యాత్ర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే సమయంలో ఎపి అసలైన ఎన్నికల వ్యూహాలు, ప్రచారాలు మొదలవుతాయి. అందుకే ఈ రిలీజ్ డేట్ వైసీపీ పార్టీకి మంచి లాభమే అన్నట్లు టాక్ వస్తోంది. ఇక బయోపిక్ కు మహి వి రాఘవ దర్శకత్వం వహిస్తుండగా విజయ్ శశి సినిమాను నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments