వైకాపా మంత్రి : రుణమాఫీని అమలుచేసేది లేదు..?

Thursday, June 13th, 2019, 07:45:09 AM IST

పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం ఏర్పడితే కొన్నాళ్ల పాటు ప్రజల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంటుంది. పాత ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద ఆశలు పెట్టుకున్న చాలా మంది లబ్ధిదారులు కొత్త ప్రభుత్వం వాటిని తీరుస్తుందా లేదా అని టెంక్షన్ పడుతుంటారు. ప్రస్తుతం ఏపీలోని రైతుల పరిస్థితి అలానే ఉంది. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో రైతు రుణమాఫీ కూడా ఉంది. బాబు హమాయంలో ఏదో మొక్కుబడిగా నడిచిన ఈ పథకం ద్వారా రైతులకు పెద్దగా లబ్ది చేకూరలేదు. 87వేల కోట్లు రైతులకు అందాల్సి ఉండగా కేవలం 15,276 కోట్లు మాత్రమే రైతన్నలకు చేరాయని వైకాపా వద్ద నివేదికలున్నాయి.

సరే.. టీడీపీ ప్రభుత్వం పోయి వైకాపా అధికారంలోకి వచ్చింది కదా రుణమాఫీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేస్తారా లేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కానీ వైకాపా మంత్రులు కన్నబాబు మాత్రం రుణమాఫీ అనేది సాధ్యంకాని పథకమని, అలాంటి హామీలను చంద్రబాబు ఇచ్చేస్తే మేము నెరవేర్చాలా అంటున్నారు. జగన్ సర్కార్ తానిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసిన చంద్రబాబును దుయ్యబడుతున్నారు.

అంటే ఇకపై రైతులను రుణమాఫీ పథకం మీద ఆశలు వదులుకోమని పరోక్షంగా చెబుతున్నారు. అయితే జగన్ మేనిఫెస్టోలో చెప్పిన రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ. 50,000, 40 శాతం సబ్సిడీతో విత్తనాల పంపిణీ వంటి హామీలను మాత్రం తప్పక నెరవేరుస్తామని అంటున్నారు