విద్య ముసుగుతో కోట్లలో దందా!

Monday, September 26th, 2016, 12:54:42 PM IST

narayana
విద్య వ్యాపార వ‌స్తువు అయిపోయిన దారుణ స‌మాజంలో ఉన్నాం. ఫీజుల్లో కార్పొరెట్ జులుం ఎంద‌రో విద్యార్థుల భ‌విష్య‌త్ ని చిదిమేస్తోంది. ఈ దారుణ న‌గ్న‌స‌త్యం తెలిసీ గ‌త ప్ర‌భుత్వాలు ఆ దందాకు తొత్తులుగా ప‌నిచేశాయి. దందాలో భాగం అయ్యాయి. ఇది ప్ర‌పంచానికి తెలిసిన ప్ర‌త్య‌క్ష నిజం. ప‌లు కార్పొరెట్ విద్యాసంస్థ‌లు ల‌క్ష‌ల్లో ఫీజులు, డొనేష‌న్లు అంటూ విద్యార్థుల త‌ల్లిదండ్రుల్ని పీక్కు తింటున్నాయి. అయినా దీనిపై ప్ర‌భుత్వాలు ఏమీ చేయ‌కుండా చూస్తూనే ఉన్నాయి.

కాస్త తెలంగాణ‌లో కార్పొరెట్ విద్య‌పై ఉక్కుపాదం మోపాల‌న్న సంక‌ల్పంతో సీఎం కేసీఆర్ కొన్ని ఎత్తుగ‌డ‌లు వేశారు కానీ.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో ఇటీవ‌లి కాలంలో ఆ విష‌యంపై సీఎంలో మాటా మంతీ లేదు. తాజాగా ఏపీ మంత్రి నారాయ‌న‌ను ఇంట‌ర్‌బోర్డ్ స‌భ్యునిగా నియ‌మించ‌డంపై స‌ర్వ‌త్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 107 జీవో తెచ్చి ఆయనకు ప్రభుత్వమే రెడ్ కార్పెట్ వేసి ఈ కొత్త పదవిలో నియమించడంపై చీవాట్లేస్తున్నారు కొంద‌రు. చంద్రబాబు కార్పొరేట్ విద్యకు కొమ్ము కాస్తూ.. విద్య ముసుగులో కోట్ల దందా సాగిస్తున్నార‌ని వైకాపా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు స‌లాంబాబు విమ‌ర్శించారు. నారాయ‌ణ‌ను మంత్రివ‌ర్గం నుంచి తొల‌గించాలి. నారాయణ విద్యాసంస్థల ద్వారా ఫీజుల పేరిట పేరెంట్ నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నారాయణ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మ‌రి అందుకు సీఎం చంద్ర‌బాబు సంసిద్ధంగా ఉన్నారా?