మంత్రి పేర్ని నాని సాదా సీదా స్టెయిల్.. హ్యాట్సాఫ్ అంటున్న వైసీపీ ఫ్యాన్స్..!

Wednesday, October 9th, 2019, 04:40:38 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత శభాస్ అనిపించుకుంటున్నాడు. అయితే సీఎం జగన్ కేబినెట్‌లో మంత్రులు కూడా జగన్‌లాగే వ్యవహరిస్తున్నారు. మునపటిలా అధికార గర్వంతో కాకుండా ప్రజాసేవకులుగా వ్యవహరిస్తుండడంతో అటు ప్రజలలో, ఇటు పార్టీలో కూడా కొందరు నాయకులపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.

అయితే వైసీపీ మంత్రులలో సాదాసీదా జీవితాన్ని గడిపే వారు ఎక్కువగానే ఉన్నారు. అయితే వారిలో ముందు లిస్ట్‌లో కనిపించేది మాత్రం మంత్రి పేర్ని నాని ఒక్కరే. మంత్రిగా ఉన్నా కూడా గతంలో ఆర్టీసీ బస్సులలో ప్రయాణించడం, ప్రకాశం బ్యారేజ్‌పై ట్రాఫిక్ జామ్‌ క్లియర్ చేయడం, బైక్‌పై క్యూలో వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవడం, అందరిలో కూర్చుని భోజనం చేయడం, పేద ప్రజలకు అండగా నిలబడడంతో ఈయనపై ప్రజాభిమానం కూడా బాగానే ఉంది. అయితే తాజాగా ఈయన మరోసారి తన శైలితో అందరి చేత ప్రశంసలు కురిపించుకుంటున్నాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పలు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు పోలీసుల బందోబస్త్, మంత్రి కాన్వాయ్‌లో కాకుండా సాధారణ వ్యక్తిలా ఆటోలో ప్రయాణం చేసారు. అయితే మంత్రిగారు ఆటోలో తమ మధ్య కూర్చుని మా సమస్యలు తెలుసుకున్నారని నిజంగా నాయకుడు అంటే ఇలానే ఉండాలని ఆటోలోని ప్రయాణికులు ఆయనపై ప్రశంసల జల్లులు కురిపించారు. అయితే దీనిపైఅ మంత్రి స్పందిస్తూ మనపై నమ్మకం ఉంచి అధికారంలో కూర్చోబెట్టింది ప్రజల సమస్యలు తీర్చడం కోసమే కదా అని, వారి మధ్య ఎక్కువగా ఉంటేనే వారి సమస్యలు తెలుసుకునే వీలు ఎక్కువగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. అయితే మంత్రిగా ఉండి కూడా పేర్ని నాని సాదా సీదా వ్యక్తిలానే వ్యవహరిస్తుండడంతో అటు వైసీపీ అభిమానులు మాత్రం ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.