జగన్‌పై పాలనపై నెగిటివ్ టాక్.. ఆ ముగ్గురు మంత్రులే కారణమా..!

Wednesday, September 18th, 2019, 08:20:50 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే జగన్ నిర్ణయాలు తీసుకోవడమే తప్పా అవేవి అమలుకు నోచుకోవడం లేదని వైసీపీ అధికారాన్ని చేపట్టిన మూడు నెలలలోనే అన్ని పార్టీల నుంచి విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అయితే జగన్ ప్రభుత్వంపై వస్తున్న ఈ వార్తలకు అనుభవలేమి ఒక కారణమైతే, మంత్రుల ఎంపిక ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అయితే జగన్ అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు మంత్రులు ఎలాంటి వైఖరి కనబరిచారన్నది పెద్దగా చెప్పనవసరంలేదు. అయితే ముఖ్యంగా ఒక ముగ్గురు మంత్రుల తీరుతో జగన్‌పై మరింత నెగిటివ్ టాక్ వినిపిస్తుందని ముగ్గురు మంత్రులలో ఇద్దరు సీనియర్లు కాగా, మరొకరు మొదటిసారి మంత్రివర్గంలోకి వచ్చిన వ్యక్తి. అయితే సీనియర్ మంత్రులలో ఒకరు జగన్ అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు రాజధాని గురుంచి సంచలన వ్యాఖ్యలు చేసి రాష్ట్ర ప్రజలను భయాందోళనలకు గురిచేసి పార్టీలో ఫోకస్ అంతా తన వైపు వచ్చేలా చేసుకున్నాడు. అయితే ఆ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయనకు వ్యక్తిగతంగా ఫోకస్ వచ్చినా, పార్టీకి మాత్రం కాస్త చెడ్డ పేరు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటుంటే, మరో సీనియర్ నేత జగన్ వద్ద తనకున్న ఇమేజ్ ద్వారా అసలు వాస్తవాలేంటో జగన్‌కి తెలియకుండా వ్యవహరిస్తూ, తన కోటరీనీ పెంచుకోవడానికే ఎక్కువగా పరితపిస్తున్నాడు. ఇక మూడో మంత్రి తొలిసారి జగన్ కేబినెట్‌లో కీలక శాఖ నిర్వహిస్తున్నా ఆవేశం తప్పా ఆలోచించి ఏదీ మాట్లాడలేకపోతున్నాడు. అంతేకాదు ఆయన ఆవేశంలో మాట్లాడుతున్న మాటలు వింటుంటే పార్టీకి సగం మైనస్ ఆయనే అవుతారేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ముగ్గురు మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికైనా జగన్ కన్నెర్ర చేయకపోతే మున్ముందు పార్టీపై మరింత నెగిటివ్ టాక్ వినబడడం ఖాయంగా కనిపిస్తుంది.