వైఎస్ జగన్‌పై అభిమానంతో ఈ అభిమాని ఏం చేశాడో తెలిస్తే షాక్..!

Tuesday, June 11th, 2019, 03:31:08 PM IST

రాజకీయ నాయకులనైనా, హీరోలనైనా మరియు ఎంతటి వారినైనా ఒక్కసారిగా వారి క్రేజ్‌ను పైకి లేపాలంటే ఖచ్చితంగా వారి అభిమానులకే సాధ్యం. ఒక్కసారి తన అభిమాన హీరో, అభిమాన నాయకుడు అని నమ్మితే వారి కోసం ప్రాణ త్యాగానికైనా సైతం వెనుకాడరు అభిమానులు. అయితే ఒక వైసీపీ నేత కూడా తమ అభిమాన నాయకుడి కోసం చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నారు.

అయితే వైసీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బెజ్జంకి అనిల్ కుమార్ అనే వ్యక్తి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. ఆ అభిమానంతోనే వైసీపీలో చేరిపోయాడు అనిల్ కుమార్. అయితే వైఎస్ జగన్ సీఎం కావాలని కోరుకుంటూ, ఆయన సీఎం అయ్యే దాక నేను పాదరక్షలు కానీ, బూట్లు కానీ ధరించనని దీక్ష చెపట్టారు. 2009 సెప్టెంబర్‌ 4వ తేది నుంచి ఈయన కాళ్లకు పాదరక్షలు వేసుకోవడం లేదు. అయితే పదేళ్ళ తరువాత ఈ వీరాభిమాని కళ నెరవేరింది. ఏపీలో వైసీపీ భారీ విజయాన్ని అందుకోవడంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హొదాలో కూర్చున్నారు. తన కళ నెరవేరడంతో అనిల్ కుమార్ సోమవారం బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకొని అనంతరం తన దీక్షను విరమింపచేశారు. పదేళ్ల తరువాత నేడు పాదరక్షలు ధరించారు. అంతేకాదు 2009లో వైఎస్ జగన్ కోసం ఆదిలాబాద్‌ నుంచి బాసర వరకు సుమారు 160 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు అనిల్. ఏది ఏమైనా జగన్ కోసం పదేళ్ళు చెప్పులు లేకుండా ఉన్నారంటే జగన్‌పై ఎంత అభిమానం పెంచుకున్నడో ఇట్టే అర్ధమవుతుంది.