వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సజ్జల కామెంట్స్.. ఏమన్నాడంటే?

Friday, July 3rd, 2020, 02:59:49 AM IST


వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం గత కొద్ది రోజులుగా పార్టీలో తీవ్ర కలకలం రేపుతుంది. సొంత పార్టీపై విమర్శలు చేస్తుండడంతో ఆయనకు నోటీసులు కూడా పంపించారు. అయితే తాజాగా ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై స్పీకర్‌కు అనర్హత పిటిషన్‌ ఇచ్చేందుకు వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్ళారు.

అయితే ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రఘురామ కృష్ణంరాజు పార్టీనీ నష్టపరిచే ప్రయత్నం చేస్తున్నారని, ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌కు ఓ లేఖ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు.