బిగ్ వైరల్: సీఎం జగన్‌పై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు..!

Wednesday, October 16th, 2019, 05:07:35 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే అంతా బాగానే ఉన్నా వైసీపీ నేతల తొందరపాటు, అనుభవలేమితో మీడియా ముందు మాట్లాడడం వంటి కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే జగన్‌కి ప్రశంసలకు బదులుగా విమర్శలు ఎదురవుతున్నాయనే చెప్పాలి.

అయితే సాధారణంగా మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు కొన్ని తప్పులు దొర్లడం పొరపాటే. అయితే సామాన్యులను కాస్త పక్కన పెడితే రాజకీయ నేతలు ఎవరైనా మీడియా ముందు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలి లేదంటే ఏ చిన్న తప్పు దొర్లినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇటీవల వైసీపీ మహిళా నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి జగన్ పాలన గురుంచి మాట్లాడుతూ పొరపాటున నోరు జారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే జగన్‌ లక్ష్యమని అనడంతో ఒక్కసారిగా వైసీపీ పార్టీనాయకులు, కార్యకర్తలు ఖంగుతిన్నారు. అయితే అలా తప్పుగా మాట్లాడినా ఆమె దానిని తిరిగి చెప్పకుండా అలానే తన ప్రసంగాన్ని కొనసాగించడంతో ఆమె మాటలను ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ నవ్వుకున్నాయి. అయితే తాజాగా గుంటూరు వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ ఏసురత్నం కూడా అదే పొరపాటు చేశారు. సీఎం జగన్ పాలనను ప్రశంసిస్తూ పొరపాటున స్వర్గీయ జగన్మోహన్ రెడ్డి అనబోయారు. అయితే పక్కన ఉన్న వారు ఆయన తప్పును చెప్పడంతో తిరిగి మళ్ళీ చెప్పబోయి కూడా తడబడ్డారు. అయితే ఈ వీడియోను ఆధారంగా చేసుకున్న ప్రతిపక్షాలు ఎవరు బతికున్నారో, ఎవరు చనిపోయారో కూడా తెలియని నేతలు వైసీపీలో ఉండడం, అలాంటి వారు అధికారంలో ఉండడం నిజంగా సిగ్గు చేటు అంటూ పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తున్నారు.