టీడీపీ గురించి షాకింగ్ నిజాలు భయటపెట్టిన వైసీపీ మహిళా మంత్రి..!

Friday, June 14th, 2019, 06:39:38 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితమే సీఎం జగన్ తన కేబినెట్‌ను కూడా ప్రకటించి వారితో కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకున్న జగన్ ఈ సారి ముగ్గురు మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ స్థానంలో వైసీపీ నుంచి పోటీ చేసి దాదాపు 25వేల్ మెజారిటీతో విజయం సాధించిన తానేటి వనితకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. మొట్ట మొదటి సారిగా ఆమెకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించారు జగన్.

అయితే తాజగా ఈమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ గురించి కొన్ని షాకింగ్ నిజాలను భయటపెట్టారు. గతంలో తను టీడీపీని వీడి వైసీపీలో చేరానని అయితే 2014 ఎన్నికలలో వైసీపీ ఓడిపోయినప్పుడు కొంత మంది టీడీపీ నేతలు నాకు ఫోన్ చేశారని తిరిగి టీడీపీలోకి వస్తే మంచి పదవులు వస్తాయని అధికారంలో ఉండవచ్చు, బెంజ్ కార్లలో తిర్గవచ్చు నువ్వు పార్టీలోకి తిరిగి వస్తానంటే చంద్రబాబుతో మాట్లాడుతాం అంటూ మభ్యపెట్టే మాటలు మాట్లాడారు. అంతే కాదు తనపై చాలా ఒత్తిడి కూడా తీసుకువచ్చారు. అయితే వారికి నేను పార్టీ మారే ప్రసక్తే లేదని, చచ్చే వరకు వైసీపీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పాను. అప్పటి నుంచి టీడీపీ నేతలు తనను ఒక తీవ్రవాదిలా చూశారని, నన్ను అణిచివేయాలని చూసినా ఈ ఐదేళ్ళు నేను ప్రజలతో మమేకమవుతూ, ప్రతి కార్యకర్తను కలుపుకుని జగనన్నను నమ్ముకుని ముందుకు వెళ్ళానని అందుకే ఈ రోజు నేను భారె మెజారిటీతో గెలవగలిగానని ఆ దేవుడి ఆశీస్సులతో మంత్రి వర్గంలో స్థానం లభించిందని నన్ను గెలిపించిన నా ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు.