మూతిపై వాతలు పెడతాం.. చంద్రబాబుకు అంబటి సీరియస్ వార్నింగ్..!

Thursday, October 10th, 2019, 06:18:05 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి కేవలం నాలుగు నెలలే గడిచినా వైసీపీ పాలనా తీరుపై మాత్రం టీడీపీ అప్పుడే పెద్ద ఎత్తున ఆరోపణలు చేపడుతూ వస్తుంది. అయితే ఇరు పార్టీల నేతలు ఓక్రిపీ ఒకరు విమర్శలు చేసుకోవడం చూస్తుంటే ఏపీ రాజకీయాలు మరింత వేడిగా మారే అవకాశాలు ఉన్నాయని అర్ధమవుతుంది. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మాటలపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆయనకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

అయితే నేడు విశాఖలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు సీఎం జగన్ పాలన తీరు గురుంచి మాట్లాడుతూ జగన్ పులివెందుల పంచాయితీ చేస్తున్నారని అన్నారు. అయితే ఈ మాటలపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇంకొసారి అలా మాట్లాడితే అట్లకాడ కాల్చి మూతిపై వాత పెడతామని కౌంటర్ ఇచ్చారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వనజాక్షి విషయంలో, ఐపిఎస్‌ అధికారి బాలసుబ్రమణ్యంపై కేశినేని నాని దౌర్జన్యానికి పాల్పడితే పంచాయితీలు చేసింది మీరు కాదా అని మండిపడ్డారు. చంద్రబాబు జీవితంలో వెనక్కి చూసుకుంటే పంచాయితీలతోనే పైకి వచ్చారని తెలుస్తుందన్నారు. పులివెందుల సీమ పౌరుషానికి ప్రతీక అని ఇంకొసారి పదే పదే పులివెందుల పంచాయితీ అని అంటే చంద్రబాబుకు అట్లాకాడ కాల్చి మూతిపై వాతలు పెట్టడం ఖాయమని అన్నారు.