బిగ్ బ్రేకింగ్: పవన్‌పై గెలిచిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..!

Wednesday, June 12th, 2019, 09:18:38 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా జగన్ తన మంత్రివర్గాన్ని కూడా ప్రకటించి 25 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం కూడా చేయించారు. అంతేకాదు వినూత్న నిర్ణయాలతో పాలనను పరుగులు పెట్టిస్తూ, తాను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవెర్చే పనిలో నిమగ్నమయ్యారు.

అయితే ఈ ఎన్నికలలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాలను గెలుచుకుని భారీ మెజారిటీనీ సొంతం చేసుకుంది వైసీపీ. ఇక అధికారంలో ఉన్న టీడీపీ మాత్రం ఘొర ఓటమిని చవిచూసింది. మరో ప్రధాన పార్టీ జనసేన ముందు దూకుడుగా కనిపించినా కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. అంతేకాదు రెండు స్థానాలలో పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్యే గ్రంథి శ్రీ‌నివాస్ భీమవరంలో పవంపై విజయం సాధించారు. అయితే ఎంతో పట్టు ఉన్న ప్ర‌ధాన పార్టీ అధ్య‌క్షుడు పవన్ కల్యాణ్‌ను ఓడించ‌డంతో గ్రంథి శ్రీ‌నివాస్‌కు వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి కేటాయించ‌డం క‌న్ఫామ్ అని అంద‌రూ భావించారు. అయితే జగన్ మంత్రివర్గంలో ఈయనకు చోటు కల్పించలేదు. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మంత్రి పదవిపై స్పందించారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలనే లక్ష్యంగా సీఎం జగన్ మంత్రి వర్గాన్ని రూపొందించారని, సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం తమకు బాగా నచ్చిందని సీఎం జ‌గ‌న్ త‌న‌కు మంత్రి ప‌ద‌వి కేటాయించినా, కేటాయించ‌కున్నా నా తుది శ్వాస వరకు వైసీపీలోనే ఉంటానని, 2024 ఎన్నికలలో కూడా వైసీపీదే విజయమని చెప్పుకొచ్చారు.