తన ప్రేమ ప్రయాణాన్ని భయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే రోజా..!

Tuesday, November 12th, 2019, 12:16:17 AM IST

వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా తన ప్రేమ ప్రయాణం గురుంచి కొన్ని ఆసక్తికర విషయాలను భయటపెట్టింది. అయితే నేడు విశాఖపట్టణంలో జరిగిన భీమిలి ఉత్సవ్ వేడుకలకు సినీ ప్రముఖులు, పలు రాజకీయవేత్తలు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన రోజా తన సినీ జీవితం, రాజకీయ జీవితంతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.

అయితే భీమిలితో తనకు ఎంతో అనుబంధం ఉందని తన భర్త సెల్వమణితో తన ప్రేమ ప్రయాణం కూడా ఇక్కడి నుంచే మొదలయ్యిందని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చామంతి సినిమా షూటింగ్ కూడా భీమిలి బీచ్‌లోనే జరిగిందని అప్పుడు ఇక్కడే ఏడాదిపాటు ఉన్నామని తెలిపింది. తన సినిమా కెరిర్ కూడా ఇక్కడే ప్రాంభమయ్యిందని, తన భర్త తనకు మొదటిసారిగా ఇక్కడే ఐ లవ్ యూ చెప్పారని అన్నారు. తాము ఇద్దరం 12 ఏళ్ళు ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నామని ఇప్పడు మా జీవితం సంతోషంగా ఉందని అన్నారు.