సీఎం జగన్ దగ్గరకు రోజా పంచాయితీ.. కలిసి పనిచేసేదే లేదు..!

Tuesday, March 24th, 2020, 07:32:52 PM IST

వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా ఇటీవల సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ షష్ఠి పూర్తి కార్యక్రమానికి ఎవరూ వెళ్లొద్దని కార్యకర్తలకు రోజా పిలుపునివ్వడం, వెళ్ళిన వారిపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా తనకు వ్యతిరేకంగా కేజే వర్గీయులను కొందరు వైసీపీ ముఖ్యనేతలు ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం స్థానిక సంస్థ ఎన్నికల నామినేషన్లలో భాగంగా కేజే కుమార్ కుటుంసభ్యులు, వర్గీయులు నామినేషన్లు వేయడం వారికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వంటి నేతలు మద్ధతు తెలుపుతుండడం రోజాకు నచ్చడం లేదని తెలుస్తుంది. అయితే నియోజకవర్గంలో కేజే వర్గీయులు మీతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నారని వారంతా రోజాకు నచ్చచెప్పినప్పటికి ఆమె వినడంలేదట. తనను ఓడించడానికి ప్రయత్నించిన వారితో కలిసి పని చేయడం సాధ్యంకాదని ఈ విషయాన్ని జగన్ దగ్గరే తేల్చుకుంటానని చెప్పడంతో ఈ గొడవ కాస్త సీఎం దగ్గరకు పోయేలా ఉంది. మరి దీనిపై జగన్ ఎలాంటి తీర్పు ఇస్తారనేది మాత్రం తెలియడన్లేదు.