బ్రేకింగ్: రోజా ఆశలు చిగురించాయిగా.. ఆ శాఖ ఖరారైనట్టేనా..!

Saturday, June 8th, 2019, 10:55:38 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి గత నెల ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే నేడు తన మంత్రివర్గాన్ని సీఎం జగన్ ప్రకటించబోతున్నారు. అయితే ఇదే రోజే వారితో ప్రమాణ స్వీకారం కూడా చేయించబోతున్నారు. అయితే నిన్న సీఎం జగన్ సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించి మొత్తం తన కేబినెట్‌లో 25మంది మంత్రులు ఉండబోతున్నారని, ఐదుగురు డిప్యూటీ సీఎంలు కూడా ఉంటారని చెప్పారు. అంతేకాదు ఇప్పుడు ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే పదవిలో కొనసాగుతున్నారని, ఆ తరువాత మిగతా వారికి అవకాశం కల్పిస్తామని తన నిర్ణయాన్ని కూడా ప్రకటించారు.

అయితే ఈ సారి కేబినెట్‌లో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేలా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించామని కూడా జగన్ ప్రకటించారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా ముందు నుంచి పార్టీలో ఉంటూ, జగన్ పట్ల ఎంతో విధేయతగా ఉన్న నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మాత్రం ఈ సారి మొండి చేయి చూపారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ముందు నుంచి ఆమెకు మహిళా కోటాలో మంత్రి పదవి ఇస్తున్నారని కీలకమైన హోం శాఖ బాధ్యతలను కట్టబెడుతున్నారని సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా బాగానే వార్తలు వినిపించాయి. అయితే మళ్ళీ రోజాకు స్పీకర్ పదవి ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారని కూడా వార్తలు వినిపించాయి. అయితే తాజాగా స్పీకర్ పదవిని జగన్ తమ్మినేని సీతారాంకు అప్పచెప్పారని నిన్నటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో జగన్ రోజాకు ఎలాంటి పదవి ఇస్తారు, అసలు మంత్రివర్గంలో చోటు కలిపిస్తారా లేదా అనే సందేహాలు చాలా మంది మదిలో మెదులుతున్నాయి. అయితే జగన్ మాత్రం రోజాకు ఫోన్ చేసి విజయవాడ రమ్మని చెప్పడంతో కీలకమైన హోం శాఖ బాధ్యతలను అప్పచెబుతున్నట్టు వార్తలు మళ్ళీ మొదలయ్యాయి. అయితే అసలు రోజాకు మంత్రి పదవి లభిస్తుందా, ఒక వేళ లభిస్తే హోం శాఖ అప్పగిస్తారా లేకా వేరే ఏదైనా శాఖను కట్టబెడుతారా అనేది మాత్రం కొద్ది గంటల్లో తేలిపోనుంది.