కెసిఆర్ పై సంచలన వాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా

Wednesday, October 9th, 2019, 10:01:45 PM IST

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులనుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే విషయంలో ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగినటువంటి వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సమావేశంలో ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. కాగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రోజా, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్రమైన విమర్శకు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేశారు. అందుకని సీఎం వైఎస్ జగన్ పట్ల ఆర్టీసీ కార్మికులంతా కూడా కృతజ్ఞతతో ఉండాలని వాఖ్యానించారు.

ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు మాత్రం సీఎం కెసిఆర్ అన్యాయం చేశారని, అనవసరంగా వారిని ఉద్యోగాలనుండి తొలగించారని ఎమ్మెల్యే రోజా అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని, తానూ ఏం చెప్పిన కూడా నడుస్తుందని కెసిఆర్ భావిస్తున్నారని, కానీ అనవసరంగా ఆర్టీసీ కార్మికుల జీవితలతో ఆడుకుంటున్నాడని తీవ్రమైన విమర్శలు చేశారు ఎమ్మెల్యే రోజా.