బిగ్ బ్రేకింగ్: పవన్ ఓటమిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు..!

Friday, June 14th, 2019, 03:31:23 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి గత నెల ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ముందు నుంచి వైసీపీ అధికారంలోకి వస్తే సీఎం జగన్ మంత్రివర్గంలో రోజాకు ఖచ్చితంగా స్థానం లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణాల అంశాలను పరిగణలోకి తీసుకున్న కారణంగా రోజాకు మంత్రివర్గ స్థానంలో చోటు లభించలేదు. అయితే పార్టీలో సీనియర్ నేతగా, ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుని నగరి నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని అప్పగించారు సీఎం జగన్.

అయితే ఈమె తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనసేన ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికల సమయం నుంచి చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి మాట్లాడింది. అంతేకాదు జనసేన ఓటమిపై కూడా స్పందించింది. పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణం చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం అని భావించింది. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యంకు 18 సీట్లను గెలుచుకున్నా పార్టీనీ నిలపలేకపోయాడు చిరంజీచి. ప్రజలు ఎంతో నమ్మకంగా ఓటు వేస్తే పార్టీ విలీనం చేసి చిరంజీవి పెద్ద తప్పు చేశారని ఆ ఎఫెక్ట్ ఇప్పుడు చిరంజీవి తమ్ముడు పవన్ పెట్టిన జనసేనపై పడిందని అందుకే పవన్ ఘొర ఓటమి పాలయ్యారని చెప్పుకొచ్చింది. కానీ జనసేన మాత్రం ఎన్నికలలో బాగా పోటీ ఇచ్చిందని, విజయం కోసం జనసేనాని బాగా ప్రయత్నించిందని అన్నారు. అంతేకాదు తన ఓటమికి కూడా ఎంతో మంది అడ్డుపడ్డారని అయినా కూడా ప్రజల ఆశీర్వాదంతో తాను గెలిచానని, రాజాకీయాలలో, సినిమాలలో అడ్డంకులు, ఒడి దుడుకులు తప్పవని వాటిని ఎదుర్కుని నిలబడే సామర్ధ్యం ఉంటేనే వీటిలోకి రావాలని చెప్పారు.