బ్రేకింగ్: నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా సరికొత్త క్లాస్.. నిజంగా గ్రేట్..!

Monday, July 1st, 2019, 06:10:04 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ అధికారాన్ని చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ముందు నుంచి సీఎం జగన్ మంత్రివర్గంలో రోజాకు ఖచ్చితంగా స్థానం లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణాల అంశాలను పరిగణలోకి తీసుకున్న కారణంగా రోజాకు మంత్రివర్గ స్థానంలో చోటు లభించలేదు. అయితే రెండున్నరేళ్ల తరువాత జరగబోయే మంత్రివర్గ విస్తరణలో రోజాకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తానని సీఎం జగన్ హామీ కూడా ఇచ్చాడు.

అయితే మంత్రి పదవి ఆశించి భంగపడిన సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నగరి ఎమ్మెల్యే రోజాకు ఇప్పటికే ఏపీఐఐసీ చైర్మన్ పదవి బాధ్యతలు అప్పగించారు జగన్. అయితే నగరి ఎమ్మెల్యేగా రెండో సారి విజయం సాధించిన రోజా ఇప్పటివరకు ఆమె సొంత నియోజకవర్గంలో పర్యటించలేదనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తునాయి. అయితే ఆ వార్తలకు బుద్ధి చెప్పే విధంగా తాజాగ రోజా తనదైన శైలిలో నియోజకవర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నియోజ‌క‌వ‌ర్గంలోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు వెళ్లిన ఎమ్మెల్యే రోజా పాఠ‌శాల అభివృద్ధికి కావలసిన సౌక‌ర్యాల‌ను సిబ్బందిని అడిగి మరీ తెలుసుకున్నారు. అంతేకాదు కాసేపు పాఠశాలలోని విధ్యార్థులకు చిన్న పాటి క్లాస్ కూడా తీసుకున్నారు. క‌ల‌లు క‌నండి.. సాకారం చేసుకోండి అంటూ బోర్డుపై రాయ‌డ‌మే కాకుండా, అందులోని భావాన్ని విద్యార్థుల‌కు అర్ధమయ్యే విధంగా చెబుతూ భవిష్యత్తులో డాక్టర్, కలెక్టర్ వంటి గోల్స్ మాత్రమే కాకుండా దేశానికి, తమ ప్రాంత ప్రజల్కు సేవ చేసుకునేలా రాజకీయాలలోకి కూడా రావాలని ఉన్నత లక్ష్యం పెట్టుకుని పనిచేస్తే అన్నింటిలోనూ విజయం వరిస్తుందని అన్నారు. అంతేకాదు మహిలలు కూడా రాజకీయాలలోకి రావాలని పురుషులతో సమానంగా పోటీ పడి పనిచేయాలని సూచనలు ఇచ్చారు.