మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. చెన్నై అపోలోలో అడ్మిట్..!

Tuesday, July 14th, 2020, 12:09:52 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు డాక్టర్లు, జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారినపడుతున్నారు. ఈ నేపధ్యంలో అధికార పార్టీ వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డాడు.

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య కాస్త అనారోగ్యంగా ఉండడంతో కరోనా శాంపిల్ టెస్ట్ చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే ఆయన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పలువురు అధికారులు, నేతలు కరోనా బారిన పడడంతో మిగిలిన నేతలలో కూడా భయం మొదలయ్యింది.