తన పేరుని సార్థకం చేసుకున్న పవన్ కళ్యాణ్ – సంచలన వాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే

Thursday, December 5th, 2019, 08:41:26 PM IST

గత కొంత కాలంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ లో విమర్శలు చేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్, సీఎం జగన్ పై చేస్తున్నటువంటి విమర్శలకు వ్యతిరేకంగా నేడు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, పవన్ పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల నుంచి తన ఇష్టారీతిలో పిచ్చిపట్టిన వాడిలా మాట్లాడుతున్నాడని, ఎందుకలా పరవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదని అన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఈ మధ్యలో కొత్తగా తన పేరుని సార్థకం చేసుకుంటున్నాడని అంటున్నారు.

కాగా పవన్ అంటే గాలి అని, అతని పేరు లాగే పవన్ కూడా ఇప్పుడు అన్ని గాలి మాటలు చెబుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వాఖ్యానించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఏమి లేని వాడని, అతడి కోసం మనం మాట్లాడుకొని మన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని అంటున్నారు. ఇకపోతే రాష్ట్ర ప్రజలందరూ కలిసి జగన్ ని నాయకుడిగా ఎన్నుకున్నారని, ఒక్క పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోతే మాత్రం రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమి లేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వాఖ్యానిస్తూ, పవన్ కళ్యాణ్ పైన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.