బ్రేకింగ్: ఆ వైసీపీ ఎమ్మెల్యే రాజకీయాలలోకి రావడానికి చిరంజీవే కారణమట..!

Saturday, June 8th, 2019, 05:43:40 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి గత నెల ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే జగన్ కేబినెట్‌లో ఉందే మంత్రివర్గం కూడా నేడు ప్రమాణస్వీకారం చేసింది. అయితే జగన్ కేబినెట్‌లో 25మంది మంత్రులు ఉండగా అన్ని సామజిక వర్గాలకు న్యాయం చేసేలా ఈ జాబితాను రూపొందించారు. సీఎం జగన్ కేబినెట్‌లో స్థానం సంపాదించిన కురసాల కన్నబాబు నేడు మీడియాతో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ నిజాలను భయటపెట్టారు.

అయితే ఈయనకు జగన్ కేబినెట్‌లో వ్యవసాయ శాఖను అప్పగించారు. అయితే తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసినప్పుడు 44 వేల ఓట్లు వచ్చాయని, అది చూసే జగన్ నాకు జిల్లా తరుపున వైసీపీ బాధ్యతలు అప్పచెప్పారని అన్నారు. ఈ సారి వైసీపీ నుంచి కాకినాడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాకుండా నా గెలుపు కోసం రెండు సార్లు కాకినాడలో ప్రచారం చేసారని ఆయన వలనే నేను గెలిచానని చెప్పుకొచ్చారు. అంతేకాదు తనకు మంత్రివర్గంలో కూడా అవకాశం కలిపించి కీలకమైన వ్యవసాయ శాఖను అప్పచెప్పారని, జ‌ర్న‌లిస్టు వృత్తిని ఒక సామాజిక బాధ్య‌త‌గా భావించి ఏ విధంగా ప‌నిచేశానో మంత్రిగా కూడా అదే విధంగా పనిచేస్తానని చెప్పారు. అయితే తాను ఎప్పుడూ మంత్రి అవుతాననని అనుకోలేదని, ఈ అవకాశం కల్పించిన సీఎం జగన్ నమ్మకాన్ని తప్పకుండా నిలబెడతానని అన్నారు. అంతేకాదు అస‌లు నేను రాజ‌కీయాలలోకి రావ‌డానికి మెగాస్టార్ చిరంజీవి గారే ప్రధాన కారణమని ఈ సందర్భంగా ఆయనకు నా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నానని, ఆయనకునా జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.