జగన్ మంత్రివర్గ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

Monday, June 10th, 2019, 04:11:50 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి గత నెల ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా రెండు రోజుల క్రితం జగన్ తన మంత్రివర్గాన్ని కూడా ప్రకటించి 25 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం కూడా చేయించారు. అయితే దీనిపై నెల్లూరు రూర‌ల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.

అయితే మీకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు కదా అని మీడియావారు అడగగా మాకు మంత్రివర్గంలో చోటు దక్కినా, దక్కకపోయినా తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మాకు అంతకంటే ఇక్ ఏఅ పదవులు అవసరం లేదని అన్నారు. అయితే మా నాయకుడు గుండెల్లో మేమున్నామని, మా గుండెల్లో ఆయన ఉన్నారని ఇక పదవులు ఉన్నా లేకపోయినా మాకు వాటితో సంబంధం లేదని అన్నారు. ఈ రోజు కాకకపోయినా ఏదో ఒక రోజు తప్పకుండా జగన్ మమ్మల్ని గుర్తిస్తాడని, మంత్రుల ఎంపిక అందరి ఎమ్మెల్యేల సమక్షంలోనే చేసారని, అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చేలా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారని అన్నారు. అంతేకాదు జగన్ చెప్పినట్టుగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ త‌దిత‌ర సామాజిక‌వ‌ర్గాల వారికి 50 శాతం ప్రాధాన్య‌తను ఖచ్చితంగా క‌ల్పిస్తాడని, మంత్రివర్గ కూర్పులో కూడా ఆ మాటను నిలబెటుకున్నాడని అన్నారు.