బిగ్ బ్రేకింగ్: టీడీపీ ఎమ్మెల్యేకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రోజా..!

Thursday, June 13th, 2019, 06:17:03 PM IST

ఏపీలో నిన్నటి నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. నిన్నటి సమావేశంలో మొత్తం ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరిగినా నేటి సమావేశంలో మాత్రం చర్చలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే నేడు ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబుల మధ్య మాటల యుద్ధమే జరిగింది. అయితే విలువలు లేకుండా మాట్లాడడం సరికాదని అన్న టీడీపీ నేతలకు వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.

విలువల గురించి టీడీపీ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టుగా ఉందని అన్నారు. సంప్రదాయాల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదని కూడా ఆమె చెప్పారు. అయితే శ్రీకాకుళం జిల్లా నుంచి తమ్మినేని సీతారాం గారు స్పీకర్‌గా ఎన్నికైనందుకు అదే జిల్లకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు క‌డుపు మండిపోతుందంటూ ఆమె అన్నారు. అయితే గతంలో కూడా టీడీపీ నేతలు స్పీకర్‌కు సరైన గౌరవం ఇవ్వలేదని స్పీకర్‌ను అవమానించడంలో టీడీపీ నేతలు ముందుంటారని దానికి చంద్రబాబు కూడా మద్ధతు తెలిపాడని చెప్పుకొచ్చింది. అందుకే నేడు మీరు స్పీకర్‌గా ఏకగ్రీవం అయినా కూడా సంప్రదాయలను కాదని చంద్రబాబు మిమ్మల్ని అవమానించారని దానికి చంద్రబాబు ప్రస్తుతం పదవి పోయి అనుభవిస్తున్న దానికంటే పది రెట్లు ఎక్కువ అనుభవిస్తారని ఇక ఎప్పటికి ప్రతిపక్ష హోదాలోనే ఉంటారని ఆమె అన్నారు.