టీడీపీ అసలు బండారం భయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే .. షాక్‌లో చంద్రబాబు..!

Wednesday, September 11th, 2019, 05:00:51 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే కొద్ది రోజుల నుంచి వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, భయంతో బాధితులు ఊళ్ళను విడిచి టీడీపీ పునరావాస కేంద్రాలకు వస్తున్నారని టీడీపీ పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తుంది.

అయితే బాధితులకు అండగా ఉండేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఛలో ఆత్మకూర్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే నేడు ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోగా టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. అయితే దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ శిబిరాల్లో ఉన్నవారు కూడా పెయిడ్ ఆర్టిస్టులేనని, ఈ శిబిరాలకు గిరిపురం నుంచి కూడా ఓ పెయిడ్ ఆర్టిస్టు వెళ్ళారని ఒక్క ఆర్టిస్ట్‌కు 5000 వేల రూపాయలు ఇస్తున్నారని అన్నారు. ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాయించడం చంద్రబాబుకు కొత్తేమి కాదని, ఇది కూడా అందులో భాగమేనని అన్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలలో శాంతి భద్రతలు విచ్చిన్నం చేసి ఆ పాపాన్ని ప్రభుత్వంపై నెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జగన్ 100 రోజుల పాలనలో రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతి ఆరోపణలు, వ్యతిరేకత ఏర్పడలేదని అది చూసి ఓర్వలేకనే టీడీపీ విషప్రచారానికి తెరలేపిందని అన్నారు.