బిగ్ బ్రేకింగ్: వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం.. షాక్‌లో వైసీపీ నేతలు..!

Thursday, June 6th, 2019, 02:20:11 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే గత నెల 30వ తేదిన ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు సీఎం జగన్. అంతేకాదు ఈ నెల 8వ తేదిన తన కేబినెట్ ఉండే పేర్లను ప్రకటించి వారితో కూడా ప్రమాణస్వీకారం చేయిస్తానని ఇదివరకే ప్రకటించారు. అయితే ఇంకా మంత్రివర్గ జాబిఒతా వెలువడలేదు, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరగలేదు. అప్పుడే ఒక వైసీపీ ఎమ్మెల్యే తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.

వైసీపీ పార్టీ తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఈ రోజు తిరుప‌తిలో మీడియాతో మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని ప్రకటించేశాడు. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌న‌కు మంత్రి ప‌ద‌వి కేటాయించ‌నున్నారంటూ వ‌స్తున్న వార్త‌లపై స్పందిస్తూ తనకు మంత్రి పదవి వచ్చినా, రాకాపోయినా తిరుప‌తి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హించ‌డ‌మంటే మంత్రి ప‌ద‌వికంటే గొప్ప‌ద‌ని ఆయ‌న అన్నారు. అంతేకాకుండా టీడీపీ కంచుకోటగా ఉన్న తిరుప‌తిలో టీడీపీని ఓడించి భారీ మెజారిటీతో గెలవడం మామూలు విషయం కాదని, ఎమ్మెల్యేగా త‌న గెలుపున‌కు కృషి చేసిన ప్ర‌తి ఒక్క వైసీపీ కార్య‌క‌ర్త‌కు, నాయ‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ, తనపై నమ్మకంతో తనకు ఓట్లు వేసి గెలిపించిన తిరుప‌తి ఓటర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నారు. అంతేకాదు సీఎం జ‌గ‌న్ ఏ ముఖ్య‌మంత్రి ప‌నిచేయ‌ని విధంగా ప‌నిచేస్తున్నార‌ని ఖచ్చితంగా ఆయన ఇచ్చిన హామీలన్నిటిని నెరవేరుస్తాడని చెప్పారు. అంతా బాగానే ఉన్నా అసలు వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని చెబుతూ భూమా తీసుకున్న సంచలన నిర్ణయమే ఇప్పుడు పార్టీలో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుందట. అయితే భూమా ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు, దాని వెనుక అసలు కారణాలు ఏమై ఉండొచ్చు అనేది మాత్రం ఎవరికి తెలియడంలేదు.