తనపై కుట్ర జరుగుతోందంటున్న వైసీపీ ఎమ్మెల్యే..!

Thursday, July 30th, 2020, 03:25:42 PM IST

వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తనకు పేకాట క్లబ్ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే ఈ విషయంపై తనపై ఈ విషయంలో కుట్ర జరుగుతుందని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేశారు. తనపై కావాలనే కొంత మంది కుట్ర చేస్తున్నారని, విజయవాడ కేంద్రంగా మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చి తనపై వార్తలు రాయిస్తున్నారని ఆరోపించారు.

అంతేకాదు తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై త్వరలో డీజీపీని కూడా కలుస్తానని డాక్టర్‌గా పని చేసిన నా లాంటి మహిళపై ఇలా అసత్య ప్రచారాలు చేయడం తగదని అన్నారు. తనతో ఫోటోలు దిగినంత మాత్రనా తన అనుచరుడు కాదని, తనతో చాలా మంది ఫోటోలు దిగడానికి వస్తారని అలా అని వారు చేసిన తప్పులలో నన్ను లాగడం ఏమిటని ప్రశ్నించారు.