వైసీపీలో ఎవరూ ఉండరు.. వైరల్ అవుతున్న వైసీపీ ఎంపీ వీడియో..!

Monday, January 13th, 2020, 07:49:03 PM IST

మీడియా ముందు తప్పులు మాట్లాడడం, తప్పుగా పలకడం రాజకీయ నేతలలో మనం తరుచూ చూస్తూనే ఉంటాం. అయితే ఒక హోదాలో ఉన్నప్పుడు మీడియా ముందు అచీ తూచీ మాట్లాడకపోతే మాత్రం అందరి ముందు నవ్వుల పాలు కాక తప్పదనే చెప్పాలి. అయితే తాజాగా వైసీపీ ఎంపీ నోరు జారి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

అయితే జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీలో పాల్గొన్న తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మీడియా ముందు మాట్లాడుతూ టీడీపీపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు జగన్ గేట్లు తెరిస్తే వైసీపీలో ఎవరూ మిగలరని నోరు జారి అడ్డంగా బుక్కయ్యాడు. అయితే వెంటనే పక్కనున్న వారు చెప్పడంతో తిరిగి టీడీపీలో ఎవరూ ఉండరని కవర్ చేసుకున్నారు. ఏదేమైనా ఇలా వైసీపీ నేతలు తరచూ నోరు జారుతుండడంతో టీడీపీ సోషల్ మీడియా వీటిపై పెద్ద ఎత్టున ట్రోల్స్ చేస్తుంది.