జగన్ కి ఎలాంటి పబ్లిసిటీ అవసరం లేదు – తాను చేతల మనిషి – వైసీపీ ఎంపీ కీలక వాఖ్యలు

Monday, March 30th, 2020, 11:51:35 AM IST

వైసీపీ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న తరువాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మరియు అధికార వైసీపీ పార్టీల మధ్యన ఒక రకమైన మాటల యుద్దాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా తాజాగా వైసీపీ పార్టీ కీలకనేత, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పై, పార్టీ అధినేత చంద్రబాబు పై పలురకాల సంచలనమైన వాఖ్యలు చేశారు. ఈ మేరకు మాట్లాడిన ఎంపీ విజయసాయిరెడ్డి…గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో వారు చేసిన పనిని గొప్పలు చెప్పుకుంటూ వారి పాలన అంతా కూడా పబ్లిసిటీకి తప్ప, రాష్ట్ర ప్రజలందరికి కూడా ఏ విధంగానూ ఉపయోగపడలేదని, ఇప్పటివరకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క ఉపయోగకరమైన పనులు చేపట్టలేదని తీవ్రమైన విమర్శలు చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి.

అంతేకాకుండా ఎంపీ విజయసాయిరెడ్డి తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై విరుచుకపడ్డారు. ఈ మేరకు “సిఎం జగన్ గారు చేతల మనిషి. ప్రచారానికి ఆయనెప్పుడు దూరం. ఏదైనా టాస్క్ విజయవంతమైతే క్రెడిట్ అధికారులకిస్తారు. లోటుపాట్లుంటే ఆ బాధ్యత తనే తీసుకుంటారు. చంద్రబాబులా రోజుకు16 వీడియో కాన్ఫరెన్సులు, మీడియా సమావేశాల హడావుడి లేదిప్పుడు. ఇదంతా పచ్చ మీడియాకు కనిపించదు”… అంటూ విజయసాయిరెడ్డి పోస్టు చేశారు.