ఆ షోకాజ్ నోటీసుకు రిప్లై ఇస్తా.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు క్లారిటీ..!

Saturday, June 27th, 2020, 02:06:40 AM IST


వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ప్రస్తుతం వైసీపీలో హాట్ టాఫిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తనకు పంపిన షోకాజ్ నోటీసుపై స్పందించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం మీద ఉన్న గౌరవంతో షోకాజ్‌కు రిప్లై ఇస్తానని తెలిపాడు.

అయితే సీఎం జగన్‌కు తెలియకుండా ఎంపీ విజయసాయిరెడ్డి తనకు షోకాజు నోటీసు ఇచ్చాడనుకుంటున్నానని అనుమానం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డికి తనపై ఎందుకు కోపముందో తెలియడం లేదని, వైసీపీలో నిజమైన స్వామిభక్తి ఉన్న ఎంపీని తానేనని అన్నారు. అయితే షోకాజ్‌ నోటీస్‌ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని, పదవిని తీసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అయితే షోకాజ్‌పై 29న మధ్యాహ్నం 12 గంటలకు సమాధానం చెబుతానని అన్నారు.