జగన్‌కి తెలిసే జరుగుతుంది.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు..!

Thursday, July 2nd, 2020, 10:29:27 PM IST


వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం గత కొద్ది రోజులుగా పార్టీలో తీవ్ర కలకలం రేపుతుంది. సొంత పార్టీపై విమర్శలు చేస్తుండడంతో ఆయనకు నోటీసులు కూడా పంపించారు. అయితే తాజాగా ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై స్పీకర్‌కు అనర్హత పిటిషన్‌ ఇచ్చేందుకు వైసీపీ నేతలు అంతా కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళారు.

దీనిపై స్పందించిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వ విమానం ఖాళీగా ఉందని ఎంపీలు ఇష్టమొచ్చినట్టు తిరుగుతున్నారని, తనకు వ్యతిరేకంగా స్పీకర్‌కు అనర్హత పిటిషన్‌ ఇవ్వడం వృథా ప్రయాసేనని అన్నారు. టీటీడీ భూములు అమ్మొద్దని చెప్పడం, తమ పార్టీ నేతలు బెదిరిస్తే ప్రాణరక్షణ కోరితే పార్టీ లైన్‌ అతిక్రమించినట్టా అని అన్నారు. అయితే ఇన్నాళ్లు ఇదంతా జగన్‌కి తెలియకుండా జరుగుతుందని అనుకున్నానని కానీ ఆయనకు తెలిసే అంతా జరుగుతుందని అన్నారు. ప్రజల కష్టాలు చెబితే అనర్హత వేటు వేస్తే లోక్‌సభలో ఎంపీలు అనే వారే ఉండరని అన్నారు.