రాజధాని విషయంలో వైసీపీ ఎంపీ సంచలన వాఖ్యలు – ఏమన్నారంటే…?

Sunday, December 15th, 2019, 05:32:38 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో అధికార పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కొన్ని సంచలన వాఖ్యలు చేశారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని విషయంలో ఇలాంటి వాఖ్యలు చేసినప్పటికీ కూడా, ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి రాజధాని విషయంలో వాఖ్యానించటం అనేది ప్రస్తుతానికి ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా తాజాగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైనటువంటి ఎంపీ విజయసాయి రెడ్డి… టీడీపీ అధినేత చంద్రబాబు పై కొన్ని సంచలన వాఖ్యలు చేశారు. కాగా గతంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.

ఇకపోతే రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్నటువంటి సీఎం జగన్ చేస్తున్నటువంటి రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు తీవ్రమైన తప్పుడు విమర్శలు చేస్తున్నారని, దానికి తోడు చంద్రబాబు కోర్టుకు వెళ్లి, స్టే ఆర్డర్ కూడా తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయమై మాట్లాడిన విజయసాయి రెడ్డి, ఏపీ రాజధాని అంశంపై నిపుణుల కమిటీ సిఫార్సులు, నివేదికల ఆధారంగా సీఎం జగన్‌ నిర్ణయం తీసుకోనున్నారని వెల్లడించారు. అంతేకాకుండా రాజధాని విషయంలో తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని వాఖ్యానించారు.