నిజంగా మందకృష్ణ అలాంటి వాడేనా…? వైసీపీ ఎంపీ మాటల వెనకాల ఆంతర్యం ఏంటి…?

Saturday, December 14th, 2019, 02:18:47 AM IST

ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పై ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఎంపీ కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా శుక్రవారం నాడు తాడేపల్లి లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి హాజరైనటువంటి వైసీపీ ఎంపీ నందిగామ సురేష్, మాదిగ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొమ్మూరి కనకారావు ఇద్డు కూడా కొన్ని సంచలనమైన వాఖ్యలు చిహ్సారు. అయితే మందకృష్ణ జాతిని అడ్డం పెట్టుకొని ఇలా ఎదిగాడని, అయితే ఆయనతో పాటు ఉద్యమంలో పాల్గొన్న వారందరు కూడా కూలీ చేసుకుని బ్రతుకుతున్నప్పటికీ కూడా మందకృష్ణ మాత్రం కొన్ని కోట్లకు అధిపతి అయ్యాడని ఆరోపించారు.

ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలోమందకృష్ణ ఒక కీలు బొమ్మలా మారారని, చంద్రబాబు చెప్పినట్లే మందకృష్ణ చేస్తున్నారని పలు విమర్శలు చేస్తున్నారు. కాగా తనకంటూ కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలను సృష్టించుకున్న మందకృష్ణ ఇకనైనా చంద్రబాబు ని వదిలి రావాలని, లేకపోతె తన జాతికే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, చంద్రబాబు ఇప్పటికి తమ జాతికి అవమానం కలిగిస్తున్నాడని ఆరోపించారు.