వైసీపీ ఎంపీ పేరు చెప్పి దందాలు.. యువకులు హల్‌చల్..!

Friday, February 14th, 2020, 08:52:31 PM IST

ఏపీ వైసీపీ ఎంపీ పేరు చెప్పి కొందరు యువకులు పెద్ద ఎత్తున దందాలకు తెరలేపారు. బాపట్ల వైసీపీ ఎంపీ నందిగాం సురేశ్ పేరిట స్టిక్కర్ ఉన్న స్కార్పియో వాహనంలో గత 15 రోజులుగా కొంతమంది యువకులంతా కలిసి దందాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారు.

అయితే మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ల్యాండ్ వివాదం చర్చించేందుకు ఎంపీ నందిగాం సురేశ్ పేరును వాడుకున్నారు సదరు యువకులు. అయితే ఈ విషయం ఎంపీకి తెలియడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. తన పేరు చెప్పుకుని ఇలాంటి పనులు చేస్తున్న యువకులను ఆయన గట్టిగా మందలించారు. తన పేరు ఉన్న స్టిక్కర్‌ను కూడా ఆయన తొలిగించారు.