మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను అడ్దుకున్న సొంత పార్టీ నేతలు..!

Monday, August 12th, 2019, 11:16:21 PM IST

ఏపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు నేడు చేదు అనుభవం ఎదురైంది. చిట్టమూరు మండలం మల్లామ్‌లో మంత్రి అనిల్‌కుమార్‌ కాన్వాయ్‌ని సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు. సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం కమిటీనీ ప్రజల అభిప్రాయం సేకరించకుండా తీర్మానించారని ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు నమ్మక ద్రోహం చేసారని ఆరోపించారు. అంతేకాదు ఈ విష్యం గురుంచి ఎమ్మెల్యే వరప్రసాద్‌రావును నిలదీస్తే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారని మండిపడ్దారు.

అయితే అనిల్ కుమార్ యాదవ్ రేణిగుంట ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా రోడ్డుపైనే ఆపిన ఇక్కడి నేతలు ఆయనను నిలదీసారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే వరప్రసాద్‌ ఆయన కుమారుడు తోళ్ల పరిశ్రమల యాజమాన్యాలతో చేతులు కలిపి అవినీతికి పాల్పడుతున్నారని, ఇసుక రవాణాలో కూడా వారు దందా సాగిస్తున్నారని అన్నారు. ప్రజలకు అవసరమయ్యే పనుల కంటే, తన వ్యక్తిగత పనులకు, వ్యాపార దందాలకు మాత్రమే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని ఈ విషయంపై సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా చెప్పారు.