ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు షాక్.. పార్టీ నుంచి సస్పెండ్‌కు రంగం సిద్దం..!

Wednesday, July 1st, 2020, 12:40:36 AM IST


వైసీపీ ఎంపీ కృష్ణంరాజుకు త్వరలో వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చేందుకు సిద్దపడినట్టు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపుతుంది.

అయితే పార్టీ తరుపున ఆయనకు షోకాజ్ నోటీసులు పంపినా కూడా సరైన వివరణ ఇవ్వకుండా తిరిగి విమర్శలు చేయడంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై చర్యలకు సిద్దం కాగా, లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ అనర్హతా పిటీషన్ సమర్పించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే రఘురామ కృష్ణంరాజును పార్టీ నుంచి తొలగించాలని సొంత జిల్లా ఎమ్మెల్యేలు కూడా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో రఘురామ కృష్ణంరాజును త్వరలోనే పార్టీ నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తుంది.