బిగ్ బ్రేకింగ్: మంత్రివర్గంపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..!

Saturday, June 8th, 2019, 09:34:51 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి గత నెల ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే నేడు సీఎం జగన్ కేబినెట్‌లో ఉండబోయే మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. అయితే జగన్ కేబినెట్లో మొత్తం 25 మంత్రులు ఉండగా, ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండబోతున్నారని నిన్నటివరకు అందిన సమాచారం. అయితే ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రులకు కేవలం రెండున్నర సం,వత్సరాలు మాత్రమే పదవిలో కొనసాగుతారని మిగతా రెండున్నర సంవత్సరాలు ఇతరులకు అవకాశం కల్పిస్తామని జగన్ నిన్న జరిగిన సీఎల్పీ భేటీలో చెప్పారు.

అయితే సీఎల్పీ భేటీ అనంతరం వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి గారిని మీడియా మీకు మంత్రివర్గంలో చోటు దక్కిందా అని అడిగిన ప్రశ్నకు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కొన్ని సంచలన నిజాలు భయటపెట్టారు. జ‌గ‌న్ కేబినేట్‌లో ఉంటామో, ఉండ‌మో అన్న విష‌యం త‌మ‌కే తెలీద‌ని, మంత్రివ‌ర్గంలో త‌న‌పేరు ఉంటుంద‌న్న అంశానికి సంబంధించి ఎటువంటి స‌మాచారం ఇంకా త‌న‌కు అంద‌లేద‌ని అన్నారు. సీఎల్పీ భేటీలో రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి మంత్రులుగా క‌న్ఫామ్ అయిన వారికి ఫోన్లు చేసి చెప్తారని జగన్ అన్నారు. రేపు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న వారు రెండున్న‌రేళ్ల త‌రువాత పదవి నుంచి తొలగిపోవడానికి మేమంతా రెడీగా ఉన్నమని, అందరికి అవకాశం కల్పించడానికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి ఎమ్మెల్యేలంతా కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు.