చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ…

Sunday, December 15th, 2019, 03:08:51 PM IST

ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణమైన ఓటమిని కూడగట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. కాగా అప్పటినుండి కూడా అధికార వ్యామోహంతో టీడీపీ అధినేత చంద్రబాబు, అధికార పార్టీ వారిపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… ఇకపోతే రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక నిత్యం సీఎం జగన్ పై చంద్రబాబు నాయుడు అనవసరమైన తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దానికి తోడు సీఎం జగన్ రాష్ట్రంలో ఎలాంటి పనులు చేసిన కూడా చంద్రబాబు విమర్శించడం ఒక్కటే పనిగా పెట్టుకున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి వాఖ్యానించారు.

ఈ మేరకు మాట్లాడిన ఎంపీ విజయసాయి రెడ్డి గతంలో చంద్రబాబు పాలనను తప్పుబడుతూ కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా “గతంలో సీఎం గా చంద్రబాబు రాష్ర్టానికి ఎలాంటి అభివృద్ధిని చేయలేదు. అంతేకాకుండా రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని కోర్టుకి వెళ్లి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇకపోతే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయడం అనేది చాలా సర్వ సాధారణమైన విషయం అని, చంద్రబాబు దాన్ని కూడా రాజకీయం చేయాలనీ చూశాడని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపణలు చేశారు.