చంద్రబాబుపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వైసీపీ ఎంపీ…?

Thursday, February 13th, 2020, 02:33:43 AM IST

వైసీపీ కీలకనేత, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా చంద్రబాబు నాయుడు పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు పై కొన్ని ప్రశ్నలను సంధించారు. కాగా రాష్ట్రంలో అధికారాన్ని వచ్చినప్పటినుండి సీఎం జగన్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేసిందేమి లేదని ప్రశ్నిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తాను ప్రతిపక్షంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావొస్తుంది కదా… ఆయన చేసిందేమిటి అని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

ఈమేరకు విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ లో ”ప్రతిపక్ష నేతగా 9 నెలల్లో చేసిందేమిటంటే… ఇసుక మాఫియాను రక్షించేందుకు ఇస్కో… ఉస్కో అంటూ శివాలూగాడు. ‘ఇన్ సైడర్’ భూముల కోసం ప్రభుత్వాన్నికూలుస్తా… తేలుస్తా అని గాల్లో కత్తులు తిప్పాడు. అవినీతి అధికారులకు కాపలాదారయ్యాడు. పొర్లు దండాలతో బొంగరంలా తిరగడమే మిగిలింది.” అని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చూసిన పలువురు నెటిజన్లు కూడా చంద్రబాబుపై మండిపడటం గమనార్హం…